మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Vallabha Bhava Ashtakam – శ్రీ వల్లభభావాష్టకమ్


పతిః శ్రీవల్లభోఽస్మాకం గతిః శ్రీవల్లభస్సదా |
మతిః శ్రీవల్లభే హ్యాస్తాం రతిః శ్రీవల్లభేఽస్తు మే || 1 ||

వృత్తిః శ్రీవల్లభా యైవ కృతిః శ్రీవల్లభార్థినీ |
దర్శనం శ్రీవల్లభస్య స్మరణం వల్లభప్రభోః || 2 ||

తత్ప్రసాదసుమాఘ్రాణ-మస్తూచ్ఛిష్టరసాగ్రహః |
శ్రవణం తద్గుణానాం హి స్మరణం తత్పదాబ్జయోః || 3 ||

మననం తన్మహత్త్వస్య సేవనం కరయోర్భవేత్ |
తత్స్వరూపాంతరో భోగో గమనం తస్య సన్నిధౌ || 4 ||

తదగ్రే సర్వదా స్థానం సంగస్తత్సేవకైస్సదా |
తద్వార్తాతిరుచిర్నిష్ఠా భూయాత్తద్వాక్యమాత్రగా || 5 ||

శ్రద్ధా తదేకసంబంధే విశ్వాసస్తత్పదాబ్జయోః |
దాస్యం తదీయమేవాస్తు భూయాత్తచ్చరణాశ్రయః || 6 ||

మస్తకే శ్రీవల్లభోఽస్తు హృది తిష్ఠతు వల్లభః |
అభితః శ్రీవల్లభోఽస్తు సర్వం శ్రీవల్లభో మమ || 7 ||

నమః శ్రీవల్లభాయైవ దైన్యం శ్రీవల్లభే సదా |
ప్రార్థనా శ్రీవల్లభేఽస్తు తత్పదాధీనతా మమ || 8 ||

ఏతదష్టకపాఠేన శ్రీవల్లభపదాంబుజే |
భవేద్భావో వినాయాసం భక్తిమార్గవృతాత్మనామ్ || 9 ||

ఇతి శ్రీ హరిదాసోదితం శ్రీవల్లభభావాష్టకమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.